12 సెప్టెంబర్ 2011

ఫొటోలు : శ్రీ రమణాశ్రమం, శ్రీ అరుణాచలం

శ్రీ అరుణాచలం (తిరువణ్ణామలై) జీవన్ముక్తిని అన్వేషించేవారు సందర్శించవలసిన క్షేత్రం. ఈ క్షేత్రాన్ని స్మరించినా ముక్తి కలుగుతుందని పెద్దలమాట. అయితే అరుణాచలం అంటే ఏమిటి, స్మరించటం అంటే ఏమిటి, ముక్తి అంటే ఏమిటి...

శాశ్వతసత్యానికి సంబంధించిన వెలుగు కొందరు మహాత్ములలో, కొన్ని పవిత్రక్షేత్రాలలో ఏమంత శ్రమలేకుండా గోచరిస్తుంది. అయితే ఆ వెలుగుని అనుభూతించడానికీ తగినంత నిర్మలమైన, ప్రశాంతమైన మానసిక స్థితి ఉండాలి. పాత్రను బట్టి గంగ అన్నట్లు, యోగ్యతను బట్టి అనుభూతి.

అరుణాచల క్షేత్రాన్నికేవలదృశ్యంగా చూసినా ఒక అనాది నిశ్శబ్దమేదో మనని పిలుస్తున్నట్టుగా ఉంటుంది. తన వద్దకు రమ్మని, తనలో కరిగిపొమ్మని ఆ పవిత్రత మనవైపు దయగా చేతులు చాస్తున్నట్లు ఉంటుంది...

శ్రీ రమణులవంటి జ్ఞానులు, పర్వతపాదంలోని ఆలయంలోనే కాక, పర్వతం పర్వతంలోనే భగవంతుని స్వరూపాన్ని దర్శించిన ఆ క్షేత్రాన్ని చూడండి.

ఈ ఫొటోలు 2007 జనవరిలో శ్రీ రమణమహర్షి జయంతి రోజులలో వెళ్ళినపుడు తీసినవి. ఈ ఫొటోలలో శ్రీ రమణాశ్రమం, శ్రీ అరుణాచల గిరిప్రదక్షిణ, కొండపై శ్రీ రమణులు నివశించిన స్కందాశ్రమం, విరూపాక్ష గుహ, యోగి రాంసూరత్ కుమార్ ఆశ్రమం, శ్రీ అరుణాచల ఆలయ దృశ్యాలను చూడవచ్చు. ఇవి 242 ఫొటోలు.

అన్ని ఫొటోలనూ చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.