25 ఆగస్టు 2011

ఫొటోలు : నేను చూసిన పాపికొండలు


కొన్ని సంవత్సరాల క్రితం పాపికొండలు చూసినప్పుడు, తీసిన ఫోటోలు ఇవి. 
తరువాత ఆ ఫోటోలు చూస్తూ అప్పటి ప్రశాంతత ని గుర్తుకు తెచ్చుకొంటే, ఒక్కొక్క ఫోటో కీ ఒక్కో వ్యాఖ్య స్పురించింది. 
ఇక్కడ కొన్ని ఫోటోలు ఇస్తున్నాను. ఇవి యాభైకి పైగా చిత్రాలు. అన్నీ చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

2 కామెంట్‌లు:

 1. మీరన్నట్లు కలల్లోంచి కలల్లోకి మేల్కున్నట్లుగానే ఉంటుందండీ పాపికొండల్లోకి ప్రయాణం. నిశ్శబ్దంగా, అనంతంగా కొండలనిండా పరచుకున్న పచ్చదనం, ఎదురుగా అనంత జల రాశి....ప్రకృతి కట్టిన గోడలా ఆ కొండలు....

  రెండు మూడు సార్లు చూశానండీ నేను. అటూ ఇటూ పోతున్న లాంచీలనైనా పట్టించుకోక...ఒక కొండ మొదట్లో....నీళ్లేమీద బుల్లి టైర్లో కూచుని చేపలు పడుతూ సీరియస్ గా నీళ్ళలోకే చూస్తూ పాటలు పాడుకుంటున్న పదేళ్ళ కుర్రాడిని చూసి దుఃఖం వచ్చింది . పట్టలేని ఈర్ష్య కల్గింది. వాడంత ఆనందంగా మనమెందుకు లేం? ఎప్పుడు ఉంటాం? అని

  ఫొటోలు చాలా బాగున్నాయి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. 'వాడంత ఆనందంగా మనమెందుకు లేం?' :) మన అంతరాంతరాల్లో మనకి తెలుసేమో కదా..
   మీ హృదయపూర్వకమైన స్పందన సంతోషాన్నిచ్చింది. ధన్యవాదాలు సుజాత గారూ..

   తొలగించండి