17 ఫిబ్రవరి 2012

ఫొటోలు: ఎల్లోరా గుహలు

మన పూర్వ మానవులు తమ సౌందర్య స్పృహనీ, కలల్నీ, విశ్వాసాలనీ ఈ గుహలలో పొందికగా పదిలపరిచారు. కఠినమైన శిలలలో దాగిన మృదువైన భావాలను శ్రద్ధగా ఆవిష్కరించారు. ఇవి జీవితానికి మనిషి సమర్పించిన ప్రేమలేఖలు. తన తరువాతి తరాలకు మిగిల్చిన కలలసంపద.

రాళ్ళలో సౌందర్యం వుంటుంది. మరలా ఆ సౌందర్యం వెనుక కఠినమైన శిలవుంటుంది. మనిషిలో సౌందర్య స్పృహ వుంటుంది. మరలా ఆ స్పృహవెనుక అగాధమైన దు:ఖం వుంటుంది. సున్నితమైన సౌందర్యమూ, కఠినమైన జీవితమూ వేరువేరా, ఒకటేనా. అవి రెండూ ఒకదానినొకటి ఆశ్రయించుకొన్నట్లుగా కనిపిస్తున్న రెండు వస్తువులా, ఒకే వస్తువా. శిలలోని ప్రతి రేణువూ తానొక శిల్పంలా కోమలంగా వ్యక్తం కావాలని సదా తపిస్తుంది. శిల్పంలోని ప్రతి ఒంపూ సదా తాను శిలలా స్థిరంగా, నిశ్చలంగా నిలబడాలని కలగంటుంది.

శిల్పులు చెక్కగా, ఇంకా అవ్యక్తంగా మిగిలిపోయిన జీవన సౌందర్యమేదో, విషాదమేదో ఈ శిల్పాలచుట్టూ పారాడుతూవుంటుంది.

అన్ని ఫొటోలనూ చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.









2 కామెంట్‌లు:

  1. సౌందర్యం వెనుక అగాధమైన దు:ఖం వుంది. అవ్యక్తంగా మిగిలిపోయిన జీవన సౌందర్యమేదో, విషాదమేదో ఈ శిల్పాలచుట్టూ పారాడుతూవుంది..

    రిప్లయితొలగించండి