ఓ సీతాకోక
చుట్టూ చేరాయి
నదీ, పర్వతాలూ
పిట్టలు కూస్తున్నాయి
గాలి నిండా
రంగుల శబ్దాలు
రాయి నాటాను
కొలను కొలనంతా
తామరాకైంది
పొద్దుటి పొగమంచు
మేలుకొన్నట్టు
కలగంటున్నానా
పాట బాగుంది
దూరంనించి వినిపించటం
ఇంకా బాగుంది
చేయి పట్టుకొంది నిద్రలో
పాప కలలోకి
ఎలా వెళ్ళను
వెన్నెల నదిలో
ఒంటరిగా ఈదుతూ
చందమామ
చందమామ
నా బాల్యంలో
చాలా అందంగా ఉండేది
అనాధ బాలిక
జాలి దానం చేసి
వెళ్ళిపోతోంది
ఆటలో ఓడిపోయాను
ఆ పసివాడి
నవ్వు చూడాలని
పంజరం
ఖాళీగా ఉంది
ప్రేమంటే తెలిసిందేమో
నిద్రలో పాపాయి
జో కొడుతున్నాను
నా కోసం
( 'హైకూ' సంపుటి నుండి )
చుట్టూ చేరాయి
నదీ, పర్వతాలూ
పిట్టలు కూస్తున్నాయి
గాలి నిండా
రంగుల శబ్దాలు
రాయి నాటాను
కొలను కొలనంతా
తామరాకైంది
పొద్దుటి పొగమంచు
మేలుకొన్నట్టు
కలగంటున్నానా
పాట బాగుంది
దూరంనించి వినిపించటం
ఇంకా బాగుంది
చేయి పట్టుకొంది నిద్రలో
పాప కలలోకి
ఎలా వెళ్ళను
వెన్నెల నదిలో
ఒంటరిగా ఈదుతూ
చందమామ
చందమామ
నా బాల్యంలో
చాలా అందంగా ఉండేది
అనాధ బాలిక
జాలి దానం చేసి
వెళ్ళిపోతోంది
ఆటలో ఓడిపోయాను
ఆ పసివాడి
నవ్వు చూడాలని
పంజరం
ఖాళీగా ఉంది
ప్రేమంటే తెలిసిందేమో
నిద్రలో పాపాయి
జో కొడుతున్నాను
నా కోసం
( 'హైకూ' సంపుటి నుండి )
చేయి పట్టుకొంది నిద్రలో
రిప్లయితొలగించండిపాప కలలోకి
ఎలా వెళ్ళను
chaalaa baagundi sir
ధన్యవాదాలు బాబాగారూ
తొలగించండిఓ సీతాకోక
రిప్లయితొలగించండిచుట్టూ చేరాయి
నదీ, పర్వతాలూ/
చేయి పట్టుకొంది నిద్రలో
పాప కలలోకి
ఎలా వెళ్ళను/
పంజరం
ఖాళీగా ఉంది
ప్రేమంటే తెలిసిందేమో
ఇలా ఉండాలి కాబోలు హైకూలంటే!
ధన్యవాదాలు హనుమంతరావు సార్
తొలగించండిపాట బావు౦ది
రిప్లయితొలగించండిదూర౦ని౦చి
ఇ౦కాబావు౦ది
----ఎ౦తబావు౦దీహైకూ..!
ధన్యవాదాలు అక్షర మోహనం గారూ..
తొలగించండి