'నీలో కొన్నిసార్లు' పుస్తకం చేతుల్లోకి తీసుకొని ఈ కవిత్వం ఏం చెబుతోంది అని ఒకటికి రెండుసార్లు ప్రశ్నించుకొన్నాను. ఈ కవిత్వం ఈ కవి ద్వారా అక్షర రూపం దాల్చిందే అయినా, ఒక సంపుటంగా సమగ్రరూపం పొందినపుడు ఈ కావ్యానికి ఇక తనదైన అస్తిత్వం ఉంటుంది.
మనిషి తననీ, సమాజాన్నీ, ప్రపంచాన్నీ, జీవితాన్నీ అన్నిటినీ ప్రశ్నించే, నిందించే క్రమంలో తనలోతుల్లో దేనికోసం వెంపర్లాడుతున్నాడు అని తరచి చూస్తే అతను అంతం లేని స్వేచ్ఛ కోసం, శాంతి కోసం వెదుక్కొంటున్నాడు అనిపిస్తుంది. కానీ ఆ స్వేచ్ఛ, శాంతి తనకు తన చుట్టూ ఉన్న సమాజం నుండి కావాలా, తన నుండే తనకి కావాలా అనే మౌలికమైన ప్రశ్న వైపే తన చూపు మరలటం లేదు. కాస్త నెమ్మదించి, కాసేపు తనలో తానే నిలదొక్కుకొని ఆ ప్రశ్న వరకూ రాగలిగితే సూర్యకాంతికి మంచుతెరలు కరిగినట్లు తనలోపలి సంక్లిష్టత కరిగి నిజమైన శాంతి ఏదో, స్వేచ్ఛ ఏదో తనంతట తనకే తెలియటం మొదలౌతుంది. తాను జీవిస్తున్న జీవితానికి తాను బానిస కాదనీ, అధికారి అనీ అర్థమవుతుంది.
నీలో కొన్నిసార్లు కవిత్వం ఒక మంచి స్నేహితుడి లాంటిది. లోపలి సంఘర్షణలో, తాను నిస్పృహలో ఉన్నానని కూడా గుర్తించలేనంత నిస్పృహలో ఉన్న మనిషిని మృదువుగా తాకి, నీలోకి చూసుకో అన్నీ చక్కబడతాయి అని ధైర్యం చెప్పే, సాంత్వన నిచ్చే స్నేహితుడు ఈ కవిత్వం. తనలోనికి ఎలా చూసుకొవచ్చునో, తన లోపల బాధ కలిగించే తననుండి ఎలా విముక్తం కావచ్చునో కొన్ని దారుల్ని సున్నితంగా పరిచి చూపించే కవిత్వం. తనదైన దారి తాను వెదుక్కొనేందుకు స్ఫూర్తి నిచ్చే కవిత్వం.
ఇది ఒక్కసారిగా చదువుకోగలిగిన కవిత్వం కాదు. ఒక్కసారి చదువుకొంటే పూర్తి అయిపోయేదీ కాదు. పాఠకుడు తనతో తాను ఉండక తప్పని స్థితిలో ఉన్నపుడు ఈ పుస్తకాన్ని తెరిచి, కవిత్వం కోసమో, మరే సాంస్కృతిక వినోదం కోసమో కాకుండా, కేవలం తనకోసం తాను చదువుకోవటం మొదలుపెట్టినపుడు, ఈ కవిత్వంలో, వాక్యాల్లో, పదాల్లో నిజాయితీగా తనని వెదుక్కొవటం మొదలుపెట్టినపుడు రెండు, మూడు కవితలు పూర్తయేసరికి ప్రశాంతదు:ఖంలోకి, మౌనంలోకి, ధ్యానంలోకి నడిపించే కవిత్వం.
ఈ కవిత్వం అందరూ చదవగలిగే కవిత్వమూ కాదు. ప్రపంచజ్వరాన్ని సంతోషంతోనో, బాధతోనో, గాయాలతోనో, విజయాలతోనో జీవితం నిండా అనుభవించి, ఇదంతా ఎంత సారహీనమో, అర్థరహితమో గ్రహించి, ఇక ఎటు నడవాలో తెలియక నిలబడిన, ఒక పక్వ మానసిక స్థితినుండి తెరిచి చూడవలసిన కవిత్వం. తనలోపలి లోతైన, నాణ్యమైన చీకటిలోకి వెన్నెల్లా, నక్షత్రాల్లా ఒంపుకోవలసిన కవిత్వం.
ఒకే ఒక్క మాటలో, ఊహాజనితమైన నీ నుండి నిజమైన నీలోకి మెల్లగా మొదటి అడుగులు వేయించే దయగల తల్లి వంటిది ఈ కవిత్వం.

ఈ కవిత్వ సంపుటి లభించే చోట్లు:
వాసిరెడ్డి పబ్లికేషన్స్, హైదరాబాద్
నవోదయ బుక్ హౌస్, కాచిగూడ, హైదరాబాద్
ప్రజాశక్తి, విశాలాంధ్ర, నవోదయ బుక్ షాప్స్, విజయవాడ
ఈ పుస్తకం: కినిగే.కాం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి