పదాలు చాలా అల్పమైనవి. జీవితం చాలా సంపన్నమైనది.
జీవితం చాలా విశాలం. పదాలు చాలా ఇరుకు.
ఊరికే 'ఈ సమయాన్ని ' అనుభూతించి చూడు;
దీని అనంతత్వమూ, అద్భుతమైన సౌందర్యమూ, ఔన్నత్యమూ,
దీని అగాధమైన నిశ్శబ్దమూ, గానమూ దర్శించగలుగుతావు.
హృదయం స్పందిస్తోంది. దీని ఉనికిపై పూలజల్లు కురుస్తోంది.
ఈ విశ్వమంతా కవితామయం. ఇది ఎప్పటికీ కవిత్వమే, ఉత్త వచనంకాదు.
నీకు కనులుంటే, సున్నితత్వముంటే జీవితమెప్పటికీ సంతోషదాయకమే.
నిజానికి, ఈ జీవితం లోతైన మూలాలు నీ లోలోపలనే ఉన్నాయి.
స్వేచ్చానువాదం: బివివి ప్రసాద్
మూలం: ఓషో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి