11 ఫిబ్రవరి 2013

రంగులెపుడు.. : Remember


రంగులెపుడు తొలిసారి పరిచయమయ్యాయో జ్ఞాపకముందా
చిననాటి బొమ్మలమీదనో, మేఘాలమీదనో, అమ్మ చీరలమీదనో, పూలమీదనో
రంగులెలా తొలిసారి ఆశ్చర్యపరిచాయో నిద్రాణంగానైనా కలలు మిగిలాయా

పసుపూ, ఎరుపూ, నీలం, వాటితో తెలుపూ, నలుపుల వేల ఆటలు
ఒక్కోపేరుతో అలవాటుపడిపోవటానికి ముందు
ఏ రహస్యలోకాల సందడి చేసాయో కాస్తయినా సజీవంగా వినిపిస్తున్నాయా

అపుడపుడూ విస్మయపరుస్తూనే ఉన్నాయి రంగులు నన్ను
వ్యాకులతలూ, తడబాట్లూ, భయాలూ చీకటిలోకి విసిరినప్పుడు    
బాల్య స్నేహితుల్లా సేదదీరుస్తూనే ఉన్నాయి
సఖుడా, ఆగిపోవటం మృత్యువు, ప్రవాహమే జీవితమని వెన్నుతడుతూనే ఉన్నాయి

దైవానికి దయలేదనీ, ఆయనకు మాటలు రావనీ ఎవరైనా అన్నపుడల్లా
వెలుతురు ఆయన దయ అనీ, రంగులు ప్రేమభాషణ అనీ చెప్పాలనిపిస్తూనేవుంది

మనకు రంగులు వెలిసిపోవటం ఎపుడు మొదలయిందో వెనుదిరిగి చూసావా
చిననాటి పుస్తకాలతో పాటు
వాటిలో దాచుకొన్న నెమలీకనీ జీవితంలోంచి విసిరేసిన క్షణాలలో
మనలోంచి మాయమైన అమాయకత్వాన్ని ఎపుడైనా తడుముకొన్నావా

తెల్లనికాంతీ, కాంతిలోంచి కాంతిలోకి ఎగిరే రంగులపక్షులూ ఎటు వెళ్ళిపోయాయో,
ధూళిమేఘాల చాటున జీవితమెలా వెలిసిపోయిందో ఎపుడైనా బాల్యాన్నడిగి తెలుసుకొన్నావా 




Remember


Remember the first time we got acquainted with colors?
Was it on the toys of childhood or the colors on the mother’s saree
Or the flowers in the meadow or the clouds in the sky?
Have you the faintest memory of when and how you were wonder-struck
With the magic of color for the first time ever?
And the fun we had,mixing up yellow,red and blue with black and white?

Do you remember the perturbation we caused in the world of sound
Before we learnt the name of each and every color?
Color still holds a surprise for us
When hesitation. fear or sorrow throw me into darkness
The sight of colored objects is warm and comforting
Like the company of childhood friends.
Putting me on the track again, they seem to say “Dear friend,
Life is an onward flowing current , which to stop is tantamount to death”

When people tell me that God is unkind or perhaps dumb.
I tell them, “The light which helps us see, is a proof of his kindness,
And the colors we behold are but an expression of his love!”

Have you ever looked back to see when for the first time
Your life had become colorless and lack-luster?
And when you had thrown away your childhood books
And along with them. The peacock feathers you preserved inside them?
Have you ever indeed searched in your soul
For the innocence of childhood
Long since vanished and now beyond your reach?

Have you ever inquired of the child in you
“What happened to that white light and the birds with bright plumage
Which flew through halos of light? Where had they all gone?
Why has my life lost its color, hidden behind the clouds of dust?


English Translation: Sri Rachakonda Narasimha Sarma

__________________________________
ప్రచురణ: 'సాహితి' ఆంధ్రభూమి దినపత్రిక 11.2.2013
లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

4 కామెంట్‌లు:

  1. వెలసిపోయిన రంగులకు కొత్త పూతలద్ది ఎదలో వర్ణచిత్రం ఆవిష్కరించారు ...అభినందనలు ప్రసాద్ గారు.

    రిప్లయితొలగించండి
  2. రంగులెపుడు వెలిసిపోయాయో...రంగులెపుడు తెలుసుకున్నామో..!ఏంటండీ మీరూ..ఒక్క పదం పట్టుకుని మనసంతా రంగులమయమయ్యేలా చేశారూ..!
    కవితేమో చిన్నప్పుడు సొంతం చేసుకున్న మొట్టమొదటి బొమ్మంత అపురూపంగానూ, తెలిమేఘంలా తేలిగ్గానూ, అమ్మ కుచ్చిళ్ళ మధ్య ఆటంత హాయిగానూ,పూల రెక్కల రంగులంత ప్రత్యేకంగానూ ఉంది.

    నాకు భలేగా నచ్చింది - థాంక్యూ! :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇప్పుడు చదివారా.. అయితే ఇంజనీరు గారు చాలా బిజీగా ఉంటున్నారు అన్నమాట.. :) ధన్యవాదాలు..

      తొలగించండి