1.
గదినిండా చీకటీ, నిశ్శబ్దం, దు:ఖం నిండివున్నాయి
దు:ఖమైనా, నిశ్శబ్దమైనా, చీకటైనా
నిండుదనం ఒక అందం, ఆనందమని
జీవితాన్ని శ్రద్ధగా గమనించి తెలుసుకొన్నాను
పూలు తమ రేకుల్ని గుండ్రంగా విప్పుకొని
పూర్ణవలయం ఒక అందమని నిత్యం బొధిస్తాయి
నదిలాంటి చల్లని, మృదువైన దు:ఖం లోకి
ప్రశాంతంగా ప్రవేశిస్తున్నాను
ఇక ఏదీ లేదు
వలయాలు వలయాలుగా
చీకటి మినహా, దు:ఖం మినహా, నిశ్శబ్దం మినహా
కానీ, క్షణక్షణమూ ఒక శబ్దం
నా వలయాలను నీటిబుడగలు చేసి చిట్లిస్తోంది
ఒక క్షణాలముల్లు నా నిండుదనాన్ని పదేపదే గుచ్చుతోంది
ఇప్పటి కాలపు దు:ఖకారణం అర్ధమైంది
2.
విస్తారమైన మైదానం మీద విహరించివెళ్ళే రుతువుల్లా
ఏవో దివ్యశక్తులు జీవితం మీద క్రీడించి వెళుతుంటాయి
అవి వస్తాయి. వికసిస్తాయి. రాలిపోతాయి.
వాటికి లయ వుంది. సౌందర్య లయం వుంది.
కానీ, కాలగణితం బోధించే గడియారం
తన క్షణాల ముల్లుతో మనల్ని భయపెట్టి
సమస్త అందాల్నీ గరుకుగా తాకి వెళుతోంది
ఇక మనలో రుతువులు లేవు
దు:ఖాలూ, భయాలూ, అమాయకత్వాలూ, ఆనందాలూ లేవు
ఇపుడు జీవితం నిండా
దు:ఖించటానికైనా తీరికనివ్వని గడియారపు వలయముంది
వృత్తంలా చుట్టుకొన్న కాలసర్పం గడియారం
మన పూర్ణ వలయాలన్నిటినీ హరించి వాటి నీడల్ని మాత్రం మిగుల్చుతోంది
మనకిపుడు దు:ఖం లేదు, దు:ఖించే వ్యవధిలేని దు:ఖం వుంది
మనకిపుడు జీవితం లేదు,
గణితాలన్నీ జీవితాన్ని ఎత్తుకుపోగా శేషంగా మిగిలిపోయిన ఖాళీ సున్నా వుంది.
____________________________________
ప్రచురణ: తెలుగు.వన్ఇండియా.ఇన్ 21.2.13 ఇక్కడ క్లిక్ చేయండి

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి