చాలా ఉత్సాహంగా మాట్లాడబోతుంటే ఉన్నట్లుండి సాలెగూటిలో మన దారం తెగిపోతుంది
చతురస్ర దృశ్యంలోకి దూకి మునకలు వేస్తున్నపుడు విద్యుత్తు నల్లటి విరామాన్ని ప్రకటిస్తుంది
కన్నూ, దృశ్యమూ యుగళగీతంలో మైమరచిన క్షణాల్లో
ఊహించని విపత్తు అనుభవాన్ని సగంలో రద్దు చేస్తుంది
చిత్రపటంలోని జలపాతాన్ని చిత్రకారుడు చెరిపేసి
ఉత్త తెల్లటి నేపధ్యాన్ని చూపించినట్టు కొన్నిక్షణాలు తెల్లబోతాయి
అప్పుడు మనకి చూపు మాత్రమే ఉంటుంది, చూసేందుకు దృశ్యం ఉండదు
పదునైన సందర్భమేదో అనుమతి లేకుండా గాయం చేస్తూ వెళ్ళిపోయినపుడూ
పిడుగులాంటి భయంలోకి ఇంద్రియాలు మేలుకొంటూ ముడుచుకొన్నప్పుడూ
మెరుపులాంటి ఆనందం నిద్దట్లో కలలా ఎటునించో పలకరించినపుడూ
కొన్ని శూన్యక్షణాలు తలలో గుర్తెరగని తలంలో నక్షత్రాల్లా మెరిసి మాయమౌతాయి
జీవన సంగీతం వినీవినీ రొదలాగా గరుకుగా తగుల్తున్నపుడూ
ఆలోచనల దారాలన్నీ ముళ్ళుపడి విప్పలేని ఉక్రోషాన్ని ఉసిగొల్పినపుడూ
కలలో, జ్ఞాపకాలో నిద్దట్లోంచి ఉలికిపాటులోకి తరిమినపుడూ
కవి అంటాడూ
నువు జీవితమనుకొన్నదాని నుండి
జీవితం కాదనుకొంటున్న ఆ శూన్యక్షణాల వైపు ఒకసారి పరికించి చూడమని
రెండు భావాల మధ్య, రెండు ఉద్వేగాల మధ్య
ఎవరో అందమైనయువతి అర్థవంతమైన నవ్వొకటి విసిరి ఆగకుండా వెళిపోయినట్లుండే
ఆ పరమశాంతమైన క్షణాలను తాకేందుకు ఒకసారి ప్రయత్నించమని
ప్రేమాస్పదులెవరినో ఉన్నంతసేపూ గుర్తెరకకుండా, లేనపుడు బెంగపడినట్టు
ఆ దృశ్యాలు లేని అనంత శూన్యాన్నే, ఆ శబ్దాలు లేని అగాధమైన మౌనాన్నే
దృశ్యాలలోనూ, శబ్దాలలోనూ వెదుకుతున్నావని కవి నీతో చెప్పి మౌనం వహిస్తాడు

కవిత చక్కగా ఉందండి.
రిప్లయితొలగించండిధన్యవాదాలు మీకు
తొలగించండిచాలా బాగుంది ప్రసాద్ గారు.
రిప్లయితొలగించండిధన్యవాదాలు వెన్నెల గారూ..
తొలగించండి"చిత్రపటంలోని జలపాతాన్ని చిత్రకారుడు చెరిపేసి
రిప్లయితొలగించండిఉత్త తెల్లటి నేపధ్యాన్ని చూపించినట్టు కొన్నిక్షణాలు తెల్లబోతాయి
అప్పుడు మనకి చూపు మాత్రమే ఉంటుంది, చూసేందుకు దృశ్యం ఉండదు"
ఎన్ని సార్లు ఎంతమంది అనుభవించి ఉండరూ ఈ క్షణాలన్నీ - మీ చేతుల్లో పడ్డాక కవితయ్యింది చూశారా; అనంతమైన శూన్యమో, ఆగధమైన మౌనమో..ఏదైనా పర్లేదు - సొంతమైతే బాగుండనిపిస్తోంది.
'అనంతమైన శూన్యమో, ఆగధమైన మౌనమో..ఏదైనా పర్లేదు - సొంతమైతే బాగుండనిపిస్తోంది.' నిజమే ఇది అందరికీ అనుభవమే.. కానీ, దాని విలువ మనకెవరికీ తెలియదు. ఇతర భావాలేమీ లేకుండా, వాటి స్పర్శతోనే ఉండగలిగితే, జీవితం లోతుల్లోకి ప్రయాణిస్తాము. అలా ఉండటం ఎంత తేలికో, అంత కష్టం. :) ధన్యవాదాలు మీ స్పందనకు.
తొలగించండి