మాటలసందడిలో తటాలున ఆమెతో అంటావు
నీ నవ్వు కొండల్లో పరుగులుతీసే పలుచనిగాలిలా వుంటుందని
పలుచనిగాలీ, మాటల సెలయేరూ ఉన్నట్లుండి
చిత్రపటంలోని దృశ్యంలా ఆగిపోతాయి
కవీ, ఏం మనిషివి నువ్వు
ప్రపంచాన్ని మొరటుగా వర్ణించడం మాని
రహస్యంగా, రహస్యమంత సున్నితంగా ప్రేమించటం
ఎప్పటికి నేర్చుకొంటావని నిన్ను నువ్వు నిందించుకొంటావు
తాకితేనే కాని, పదాల్లోకి ఒంపితేనే కాని
నీ చుట్టూ వున్న అందాన్నీ, ఆనందాన్నీ
అనుభవించాననిపించదు నీకు
నిజానికి, వాటిని తాకకముందటి
వివశత్వ క్షణాల్లో మాత్రమే నువు జీవించి వుంటావు
తాకుతున్నపుడల్లా నిన్ను మరికాస్త కోల్పోతావు
పసిబిడ్డల పాలనవ్వులకన్నా సరళంగా
జీవితం తననితాను ప్రకటించుకొంటూనే వుంటుంది ప్రతిక్షణం
నీకో ముఖం వుందని అద్దంచెబితే తప్ప తెలుసుకోలేని నువ్వు
లోకంలోని ప్రతిబింబాల వెంట పరుగుపెడుతూ
జీవితాన్ని తెలుసుకోవాలని చూస్తావు
ఆమె కోల్పోయిన నవ్వుని మళ్ళీ ఆమెకి ఇవ్వగలవా
___________________

ప్రచురణ: సారంగ 12.6.2014
:)) చాలా బాగుందండీ :). పలుచని గాలి కెరటమేదో మమ్మల్నీ తాకింత హాయిగా..
రిప్లయితొలగించండిఆఖరు వాక్యం ఎందుకు? మీ కవితల్లో నిరాశ గానీ ఫిర్యాదు గానీ చూడలేమసలు. కవిగారూ, నప్పవు మీకవి :)
చివరి వాక్యం నా భావన వేరు. కానీ, సరిగా చెప్పలేకపోయానేమో. వేరే మిత్రులు కూడా ఆ వాక్యం పై కంప్లైంట్ చేసారు. :(
తొలగించండికవిత నచ్చినందుకు ధన్యవాదాలు మరి. :)