12 మార్చి 2018

ఏడు పుస్తకాలు : 1. భగవాన్ స్మృతులు - చలం

 శ్రీ రమణమహర్షి సన్నిధిలో జీవించినవారి అనుభవాలని చలం రికార్డు చేసిన పుస్తకం ఇది. ఇది చదివేనాటికి జీవితం గురించీ, మనుషుల గురించి తీవ్రమైన అయోమయంలో ఉన్నాను. ఇది చదివాక, జీవితానికి ఒక అద్భుతమైన లక్ష్యం ఉందనీ, భూమ్మీద దురదృష్టకరమైన మానవజాతిలో నూరుశాతం ప్రేమించదగిన, నమ్మదగిన మనిషి ఒకరైనా జీవించి వెళ్ళారనీ అర్థమైంది.ఈ పుస్తకం ఇప్పుడు ప్రియదర్శిని ప్రచురణలు, హైదరాబాద్ వారివద్ద లభిస్తోంది. 
శ్రీ రమణాశ్రమం,  తిరువణ్ణామలై వారి వద్ద కూడా లభిస్తుంది.