12 మార్చి 2018

ఏడు పుస్తకాలు : 3. క్రాంతి బీజాలు - ఓషో

 ఓషో రచనలలో నేను చదివిన మొదటిపుస్తకం ఇది. ఓషో జీవిత విధానమూ, ఆయన బోధ గురించి జరిగిన దుష్ప్రచారాల వలన చాలా కాలం ఆయన్ను దూరంగానే పెట్టినా, మిర్దాద్ కు ముందు కనిపించిన ఆయన నాలుగుమాటలూ, భిన్నంగా ఆలోచించేలా చేసాయి. ఒక మిత్రుడి దగ్గర ఈ పుస్తకం చూసి, చదువుకొని, ఏ పుస్తకమూ రెండోసారి చదివే అలవాటు లేకపోయినా, స్వంతంగా ఒక పుస్తకం ఉండాలని కొనుక్కొన్న కాపీ ఇది.

తన శిష్యురాలు ఆనందమయికి ఓషో రాసిన ఉత్తరాలు ఈ పుస్తకం. చాలా మృదువుగా, ప్రేమగా జీవితం పట్ల ఎరుకని బోధిస్తారు ఈ ఉత్తరాల్లో. మేథ తో కాక, హృదయంతో ఓషో భావాలని సమీపించినపుడు, మన జీవితాల్లో అంతకుముందు లేని తాజా వెలుతురు ప్రసరిస్తుంది.

నా వరకూ అన్ని రకాల కండిషనింగ్ ల నుండీ విముక్తం కావటానికి, కాగల ధైర్యం తెచ్చుకోవటానికి చలం తరువాత ఓషో మహోపకారం చేసారని భావిస్తాను.ఓషో రచనలు ఇప్పుడు తెలుగులో కూడా విరివిగా లభిస్తున్నాయి. ఆన్ లైన్ లో వెదకవచ్చును.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి