పిల్లలూ మమ్మల్ని క్షమించండి
భూమి నుండి వేర్లని వేరు చేసి
మొక్కని మహావృక్షం కమ్మని శాసించినట్టు
జీవనానందం నుండి మీ చూపు తప్పించి
మిమ్మల్ని గొప్పవ్యక్తులు కమ్మని దీవిస్తాం
జీవితమంటే
హృదయం నుండి హృదయానికి
ఆశ్చర్యం నుండి ఆశ్చర్యానికి
కాలం నుండి కాలంలేని చోటుకి వెళ్ళటమని
ఎవరో చెబితే ఇక్కడికి వచ్చారు కాని
జీవితమంటే
అందరికన్నా ముందుండటమనే అగ్నిలోకి దూకటమని
చనిపోయే వరకూ రేపటిలోనే బ్రతకటమని
మాయావస్తుసముదాయాల మధ్య దారితప్పి తిరగటమని
మీ కోమల హృదయాల్లో జీవరసం ఎండిపోయే వరకూ నేర్పి
మీ చూపుల్ని కాగితాలకి ఊడిరాకుండా అతికించి మరీ
యోగ్యతాపత్రాలు బహూకరిస్తాము
పిల్లలూ మమ్మల్ని క్షమించండి
చదువంటే చూడటమనీ, ప్రశ్నించటమనీ, ఊహించటమనీ
చదువంటే ఆటలనీ, పాటలనీ,
పంచుకోవటంలోని పరమానందాన్ని తెలుసుకోవటనీ
చదువంటే తల్లి మెడను కౌగలించుకొన్నట్టు
జీవితాన్ని కౌగలించుకోవటమెలానో నేర్చుకోవటమనీ
మీలోలోపలి జీవితేచ్చ మీతో గుసగుసలాడి వుండొచ్చుకానీ
చదువంటే తడినేలని ఎడారి చేసి విత్తనాలు నాటడమని,
బెరడై కలకాలం బతకాలి కాని,
పూలై, పళ్ళై రసమయలోకాల్లోకి పరుగుపెట్టకూడదని
మీకు పట్టిన సంతోషాన్ని మార్కులతో వదిలించి మరీ నేర్పుతాము
పిల్లలూ మమ్మల్ని క్షమించకండి
మీలోంచి దయా, తృప్తీ, రసమూ వడకట్టి
మిమ్మల్ని ఘనపదార్ధంగా తీర్చిదిద్దినందుకు కృతజ్ఞతగా
మీరు డబ్బు యంత్రాలు కండి
బహుళజాతి విపణివీధుల బానిసలై తరించండి
కాఠిన్యం నిండిన ప్రేమలతో కాలం గడపండి
మమ్మల్ని వృద్దాశ్రమాలకి కానుక చేసి వదిలించుకోండి

"భూమి నుండి వేర్లని వేరు చేసి
రిప్లయితొలగించండిమొక్కని మహావృక్షం కమ్మని శాసించినట్టు", "చదువంటే తడినేలని ఎడారి చేసి విత్తనాలు నాటడమని," - ఈ రెండు వాక్యాలూ అద్భుతంగా ఉన్నాయండీ. నలిగీ నలిగీ ఉన్న ఇలాంటి టాపిక్ మీద అసలు కవితలింకేం వ్రాయగలం అనుకుంటాను గానీ, మీరు వాడిన ఉపమానాలూ, కవితను నడిపించిన తీరూ చాలా చాలా నచ్చాయి. ' కవిత్వమనే రసవిద్య తెలియాలి ' - అన్న మాట మరొక్కసారి నాకు నేనే చెప్పుకుంటూ - మీకు కృతజ్ఞతలు. :)
విద్యావిధానం చాలా పరిణతి పొందాలి.. ఇప్పుడున్న పద్దతులు పిల్లలకు అక్కర్లేని చాలా దు:ఖాన్ని కలిగిస్తున్నాయన్న బాధ ఎప్పుడూ నాలో మెదులుతూనే వుంటుంది. ఈ వస్తువు పైన ఇంకా బాగా రాయగలిగితే బావుండును అను కూడా అనిపిస్తూంది నాకు, నేనో, మరేవరైనానో కూడా..
తొలగించండిపిల్లల ఊహలకు మించిన భాషలో పిల్లల్ని గురించి పెద్దలు పడాల్సిన పశ్చాత్తాపాన్ని మీ సహజ సుందర మృదు శైలిలో మందలించి మరీ చూపించారు. పిల్లమనసులు ఇంకా మిగుల్చుకున్న పెద్దలను కాస్తంతైనా ఆలోచించదగ్గ గొప్ప కవిత.ధన్యవాదాలు బివివి ప్రసాద్ సార్!
రిప్లయితొలగించండిమీరన్నట్లు పిల్లల మనసులు ఇంకా మిగుల్చుకున్న పెద్దలు కాస్తంతైనా ఆలోచించిస్తారనే ఆశతోనే రాసాను సర్. మీ ఎప్పటి ప్రేమకు ధన్యవాదాలు.
తొలగించండి