1.
జీవితం ఒక మహా విహంగం
దాని రెక్కలువిప్పినపుడు అది పగలు
మూసినపుడు అది రాత్రి
ఆ పక్షిని నేను దర్శిస్తున్నపుడునేను ఎక్కడ ఉన్నానో నాకు తెలియకుండా ఉంది
నేను ఉన్న ఈ సృష్టి ఎక్కడ ఉంది
నా ఊహకి అందని ఈ విహంగం నా ద్వారా శ్వాసిస్తోంది
నా కనుల ద్వారా అది చూస్తోంది
నేను నిదురించినపుడు అది విశ్రాంతి పొందుతోంది
2.
నేను పొదుపుగా దాచుకొంటున్న నా ఊహలన్నీ
ఎండమావులే అని గమనించాక తెలుస్తోంది
నేను నేను కాననీ జీవితాన్ననీ స్పష్టంగా తెలుస్తోంది
ఇపుడు నేనొక మహా విహంగంవెలుతురు నా కల, చీకటి నా విశ్రాంతి
నేను ఎక్కడ ఉన్నానో,ఎపుడు మొదటిసారి నా రెక్కలు విప్పానో
ఎందుకు, ఎక్కడికి వెళుతున్నానో
ఎప్పటికీ రహస్యం
3.
రహస్యం నా నివాస స్థలం
నేను మహా విహంగాన్ని, నేను జీవితాన్ని
10 August 2012

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి