పూలూ, పక్షులూ, ఎడారులూ, సముద్రాలూ,
మబ్బులూ, సూర్యుళ్ళూ, నక్షత్ర సముదాయాలూ
ఎవరూ ఎరుగని ఏ శూన్యం నుండో
ఆనందాన్ని నీలోకి ఒంపుతున్నాయి
నీ జీవితం స్వయంగా ఆనందపు అభివ్యక్తి
దు:ఖం అనే నల్లటి ముసుగును మనపైన కప్పుకొని
కాలాన్ని గాఢాంధకారంగా చూస్తున్నపుడు కూడా
మనం ఆనందపు రూపంగానే వున్నాం
జీవనానందం అనే కాంతి మన కళ్ళని వెలిగించకపోతే
అంధకారాన్ని అయినా ఎలా చూడగలం
ఆనందించటం నీ హక్కు మాత్రమే కాదు. నీ బాధ్యత.
కళ్ళులేకుండా మరొకరికి దారి ఎలా చూపటం
నీకు తెలీని ఆనందాన్ని మరొకరికి ఎలా ఇవ్వటం
ఆనందంగా ఉండే పనిలో ఆనందంగా ఉండటమే విశ్రాంతి
ఆనందం దేనికీ ప్రతిచర్య కాదు
ఆనందానికి ఏదీ ప్రతిఫలమూ కాలేదు
మనం మాత్రమే ఆనందం పొందటంలేదు
ఆనందమూ మనని నిరంతరం పొందుతోంది
ఆనందమే ప్రేమ. ఆనందమే త్యాగం. సాహసం. స్వేచ్చ
ఆనందమే నిరంతర ముక్తబంధం
కారణాల సంకెళ్ళని ఆనందం తెంచుతోంది
మిత్రమా! అకారణంగా ఆనందించు
నువ్వు ఎవరూ ఎరుగని ఏకాంతపు ఆనందానివి
____________________
'నేనే ఈ క్షణం' సంపుటినుండి
మబ్బులూ, సూర్యుళ్ళూ, నక్షత్ర సముదాయాలూ
ఎవరూ ఎరుగని ఏ శూన్యం నుండో
ఆనందాన్ని నీలోకి ఒంపుతున్నాయి
నీ జీవితం స్వయంగా ఆనందపు అభివ్యక్తి
దు:ఖం అనే నల్లటి ముసుగును మనపైన కప్పుకొని
కాలాన్ని గాఢాంధకారంగా చూస్తున్నపుడు కూడా
మనం ఆనందపు రూపంగానే వున్నాం
జీవనానందం అనే కాంతి మన కళ్ళని వెలిగించకపోతే
అంధకారాన్ని అయినా ఎలా చూడగలం
ఆనందించటం నీ హక్కు మాత్రమే కాదు. నీ బాధ్యత.
కళ్ళులేకుండా మరొకరికి దారి ఎలా చూపటం
నీకు తెలీని ఆనందాన్ని మరొకరికి ఎలా ఇవ్వటం
ఆనందంగా ఉండే పనిలో ఆనందంగా ఉండటమే విశ్రాంతి
ఆనందం దేనికీ ప్రతిచర్య కాదు
ఆనందానికి ఏదీ ప్రతిఫలమూ కాలేదు
మనం మాత్రమే ఆనందం పొందటంలేదు
ఆనందమూ మనని నిరంతరం పొందుతోంది
ఆనందమే ప్రేమ. ఆనందమే త్యాగం. సాహసం. స్వేచ్చ
ఆనందమే నిరంతర ముక్తబంధం
కారణాల సంకెళ్ళని ఆనందం తెంచుతోంది
మిత్రమా! అకారణంగా ఆనందించు
నువ్వు ఎవరూ ఎరుగని ఏకాంతపు ఆనందానివి
____________________
'నేనే ఈ క్షణం' సంపుటినుండి
మిత్రమా! అకారణంగా ఆనందించు,.....అనిర్వచనీయంగా..అనాలోచితంగా..అవసరమంటారా..
రిప్లయితొలగించండిమీ ప్రశ్న అర్థం కాలేదు..
తొలగించండిఅకారణమైన ఆనందం,....వీలవుతుందా అని....
రిప్లయితొలగించండివీలైతే అది పిచ్చితనం అనిపించుకుంటుందేమోనని..
ఓ చిన్న సందేహంలో అలా.....
ప్రవర్తన లో కార్యకారణ సంబంధం కోల్పోవటం పిచ్చితనం అంటాము. అక్కడ మనసు స్థిరత్వాన్ని కోల్పోయి, అనేక భావాలూ, ఉద్వేగాలూ ముప్పిరిగొంటాయి. పిచ్చితనంలో ఉండేది ఆనందం కాదు, అచేతన. అటువంటి వ్యక్తి మనకి ఆనందంగానో, మరే ఉద్వేగంలోనో ఉన్నట్టు కనబడతాడు. కానీ, తానెలా ఉన్నాడో తనకి ఎరుక ఉండదు. లేదా ఆ ఎరుక ఉన్నా, దానిని పట్టించుకోడు, మనోబలం లేక.
తొలగించండికార్యకారణ సంబంధాన్ని దాటి ఉండటం ఆనందం. అక్కడ మనసు ఖాళీగా, ప్రశాంతంగా ఉంటుంది. ఉద్వేగాలూ, భావాలూ దాటిన స్థితి అది. అక్కడ మానసిక చైతన్యం ముక్కలు కాకుండా, సమగ్రంగా ఉంటుంది. తాను శాంతిగా ఉన్నానన్న ఎరుక ఉంటుంది.
మనని మనం ప్రశాంతంగా పరిశీలించుకొంటే, మనకు కోరిక తీరినప్పుడు కలుగుతుందనుకొన్న ఆనందం, కోరిక తీరడం వలన కాక, కోరిక మాయమైన శాంతి వలన కలుగుతుంది. అంటే, శాంతీ, శాంతిగా ఉన్నానన్న ఎరుక వలన కలిగే ఆనందమూ, మన సహజ స్థితులు. మనస్సు చంచలం కనుక, శాంతిగా ఉంటే తనకి ఉనికి ఉండదు కనుక, అది మళ్ళీ మరొక కోరికని పుట్టించుకొని దుఃఖపడి, అది తీరాక తను సుఖంగా, ఆనందంగా ఉన్నట్టు భ్రమపడుతుంది.
పెద్దలు ఒక కథ చెబుతారు. ఒక కుక్క ఎండిన ఎముకను కరిచి, కరిచి దాని చిగుళ్ళు చిట్లి వస్తున్న రక్తాన్ని చప్పరించి, అది ఎముక నుండి వస్తున్న ద్రవంగా భావించి ఆనందంగా చప్పరిస్తుందట. లోకంలో మనం పొందే ఆనందమంతా, మనని కోరికలతో ముక్కలు చేసుకొని, మళ్ళీ ఆ కోరికలు తీరినప్పుడు, సమగ్రంగా ఉండటం వలన కలిగే ఆనందమే. అంటే ఆనందం మన సహజ, నిజ స్వభావం. అది కార్యకారణాలకు అవతలిది. మన ఉనికి ఆనందం. మన మనస్సుని మనం ప్రశాంతంగా, నిజాయితీగా పరిశీలిస్తే ఇది సత్యమే అని తెలుస్తుంది.
శాంతిగా ఉన్నానన్న ఎరుక వలన కలిగే ఆనందమూ,....
రిప్లయితొలగించండి1) ఇక్కడ ఎరుక ఒక కారణం కదా...
నా మొదటి ప్రశ్న కూడా ఇదే....
ఉద్వేగాలూ, భావాలూ దాటిన స్థితి అది....
2) ఆనందం ఒక ఉద్వేగం కాదా..
3) కుక్కకి కలిగే ఆనందం, సమగ్రంగా వుండడం వలన కలిగే ఆనందం ఒకటేనా...
మిమ్మల్ని ఇబ్బంది పెడదామని అడగడం లేదు సార్,...నాకర్థం కాక పోవడం వల్లనే..ధన్యవాదాలండి.
లోపలి విషయాన్ని వివరించి చెప్పటం కష్టం, ఎవరికి వాళ్ళు తమలోపల పరిశీలించుకోవాలి. ఇతరుల పదాలు మన చూపుని అటువైపు మళ్లించటం వరకే సహాయం చేస్తాయి. పదాలతో ఆగకండి. అవి సూచిస్తున్న వైపుగా మీలోపల పరిశీలించుకోండి.
తొలగించండిఎరుక, శాంతి, ఆనందం ఒక నైరూప్యస్థితిని తెలియచెయ్యడానికి, అవగాహనా సౌలభ్యం కోసం వాడిన పదాలు. ఉన్నది ఒకటే దానిని శాంతి అన్నా, ఆనందం అన్నా, ఎరుక అన్నా. అది ఉద్వేగాలకీ, ఆలోచనలకీ ఆధారంగా వుంటూనే, వాటికి అతీతంగా ఉండే కేవల స్థితి.
ఉపమానం చెప్పినపుడు, ఆ ఉపమాన వస్తువూ, మనమూ ఒకటని అర్థం కాదు. తననుండి వచ్చిన దానినే, తాను అన్యవస్తువుగా గా భావించి స్వీకరించి ఆనందిస్తుంది అన్న తత్వమే ప్రధానం. అట్లాగే మన సమగ్రత కోరిక వలన భంగపడి, కోరిక తీరడం వలన తిరిగి పొందుతామనే అర్థం వరకే ప్రధానం.
ధన్యవాదాలు ప్రసాద్ గారు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను,.
తొలగించండి