1.
ప్రేమించానని పదేపదే చెప్పకు
మాటల్ని మాత్రమే జీవించటం నుండి
వాటి మధ్య మేలుకొనే మౌనాన్ని జీవించటంలోకి వెళ్ళినపుడు
ప్రేమ ఒక పదం కాదని తెలుస్తుంది
రెండు జీవితాలు దేవాలయం వంటి ఒకే మౌనం లోకి ప్రవేశించటం ప్రేమ
2.
ప్రేమించమని పదేపదే అడగకు
తారకలు కాంతిని వెదజల్లినట్లు
ప్రేమించటమే ఉంటుంది, ప్రేమించబడటం ఉండదు
ప్రేమించటమంటే
లోపల వెలితి ఉందని భ్రమపడటం కాదు, వెలితి లేదని కనుగొనటం
ఖాళీగా కనిపించే ఆకాశం నీ హృదయంతో నిండిపోవటం ప్రేమ
ప్రేమ మేలుకొన్నపుడు, మిత్రుడా,
ఇవ్వవలసింది ఎంతకీ తరగదు, తీసుకోవలసింది ఏమీ కనిపించదు
3
ఒక కవిత విను:
పూవుని కోసేవాడికి సౌందర్యాన్ని తాకటం తెలియదు
సౌందర్యరహస్యం తెలిసినవాడు తానే పూవు అవుతాడు
జీవితాంతం సాధన చేసైనా పూవుని చూడటం నేర్చుకోవాలి
కడపటి క్షణంలో పూవులా రాలాలి
అవును, ప్రేమ ఒక పుష్పం
To the lover
Time and again
Do not say
That you fell in love
When you go to live the silence
That woke up in between words
A thought dawns on you-
LOVE is not merely a word
Two lives entering a silence
Reminiscent of a place of worship
Is love
Never beseech any body
To love you
Like twinkling stars at night
Sprinkling light
There can be only a loving-
Being loved never exists
Deluding a deficiency
Is not loving
Loving is to find out
That there is no deficiency
The Heart till now
Looking like empty
Getting filled in
Incessantly is love
When love wakes up
Offering is an unending process
You cannot find any thing
For receiving
Do listen to this poem:
The one who prefer
Plucking a flower
Will never know
How to touch its beauty
The one who know
The secrets of beauty
Will become him-self a flower
Making a relentless pursuit
Through out the life
Do perfect the art
Of looking at a flower
To wither like a flower
In the dying moments
Yes, love is a flower
____________________
ప్రచురణ: నవ్య వీక్లీ 13.3.2013
Transliteration By Sri T. Chandra Sekhara Reddy
Transliteration By Sri T. Chandra Sekhara Reddy
wonderful as expected.
రిప్లయితొలగించండిThank you Sateesh..
తొలగించండిఎంత అందంగా చెప్పారో ప్రేమ గురించి...
రిప్లయితొలగించండి"ప్రేమించటమే ఉంటూంది...ప్రేమించబడటం ఉండదు..." నిజం...
మీ కలం నుంచి జాలువారుతున్న ఎన్నో అందమైన కవితలు చదవటం నా అదృష్టం ప్రసాద్ గారు.
తమ కవిత్వాన్ని ఆనందించే పాఠకులు కనిపించినపుడు కవులకి చాలా సంతోషం కదా.. హృదయ పూర్వక ధన్యవాదాలు మీకు..
తొలగించండిఅందుకే నా సోదరా అందరికీ ఇంత ప్రేమ పంచుతున్నావు .........
రిప్లయితొలగించండిధన్యవాదాలు అన్నగారూ..
తొలగించండి