29 డిసెంబర్ 2012

బివివి ప్రసాద్ కి డా.సంజీవదేవ్ ఉత్తరాలు


డాక్టర్ సంజీవదేవ్ గారు 1991 నుండి పరిచయం. తరచూ ఉత్తరాలు రాసేవాడిని. ఉత్తరం వెళ్ళిన వారం లోపు ఆయన నుండి జవాబు వచ్చేది. ఇది నాకు మాత్రమే కాక, వారితో పరిచయం ఉన్న అందరికీ అనుభవమే. సరళం గా కనిపిస్తూనే, ఎంతో ఆలోచనాత్మకంగా ఉండటం వారి వచనం ప్రత్యేకత. తెలుగువాళ్ళు గర్వించ తగిన మేధావి, అంతకు మించి ఉన్నతమైన వ్యక్తి సంజీవదేవ్ గారు. వారి వచనం ప్రభావం నాపైన చాలానే వుంది. ఒకచోట అన్నట్టు, తెలుగు సాహిత్యవేత్తలలో నేను చదివిన వారిలో, గురజాడ తరువాత అటువంటి సంయమనం, సంజీవదేవ్ గారిలోనే చూసాను. తెలుగు సాహిత్యం ఎంతో ఇష్టంగా మనోవికాసం కోసం చదువుకొనే వారెవరున్నా, వారిని తప్పక సంజీవదేవ్ వ్యాసాలు చదవమని చెబుతాను. అవి రెండు సంపుటాలుగా తెలుగు ఆకాడమీ వారి ప్రచురణలలో దొరుకుతున్నాయి.

వారు నాకు రాసిన ఉత్తరాలలో కొన్ని ఇక్కడ మిత్రులతో పంచుకొంటున్నాను.











6 కామెంట్‌లు:

  1. దాచుకున్న జ్ఞాపకాలను పంచుకున్నందుకు ధన్యవాదాలు..
    ప్రసాద్ సర్

    రిప్లయితొలగించండి
  2. ప్రసాద్ జీ ! మీరు పొస్ట్ చేసిన సంజీవదేవ్ గారి లేఖలన్ని ఆసాంతం చదివాను. మీరు ఇలాంటి వారితొ ఉత్తర ప్రత్యుత్తరాలు నెరపడం మీకు చాలా తొడ్పడిందనే చెప్పాలి. ఇక సంజీవదేవ్ గారి లేఖా రచన ఝురి అధ్బుతం. ఆయన మీతొ ఎంతగానొ అనుభూతి చెందారనిపిస్తుంధి. ఆయన భాషా ప్రయోగం అత్యధ్బుతం.. ముఖ్యంగా పెళ్ళి గురించి ఆయన నిర్వచనం అమోఘం. ఇంత మంచి సాహిత్యాన్ని అంధించిన మీకు ధన్యవాదాలు.
    శాంతిశ్రీ

    రిప్లయితొలగించండి
  3. ప్రసాద్ గారు, మీ బ్లాగ్ మొదటిసారి చూసాను. అన్ని పోస్టులు చదివాను. మీ రచనలు, సంజీవదేవ్ గారి ఉత్తరాలు చదివి చాల ఆనందించాను. మీరు తణుకు వారు. మీకు అత్తిలిలో ఉన్న శ్రీ శ్రీపాద రామశాస్త్రి గారు తెలుసా? నేను ఆయన విద్యార్ధిని. ఆయన దగ్గరే మీగురించి, సంజీవదేవ్ గారి గురించి విన్నాను.
    విద్యార్ధి

    రిప్లయితొలగించండి