మాతృభాష మాట్లాడుతున్నపుడు ఎలావుంటుంది
పసిదనంలో అమ్మ ఊయలలోవేసి జోల పాడుతున్నట్లుంటుంది
ఆమె గారాబు చేస్తున్నట్టూ, ఆటళవేళల ఆతృతగా హెచ్చరిస్తున్నట్టూ వుంటుంది
బాల్యంలో స్నేహితులతో కాలవగట్ల వెంటా, పొలాల నడుమా పరుగెడుతున్నట్టూ,
చెట్టూ, పుట్టల్నీ, పిట్టల్నీవాటివాటి భాషల్లో పలకరిస్తున్నట్టూ వుంటుంది
నేస్తాలతో నవ్వుకొన్నట్టూ, తిట్టుకొన్నట్టూ, చిరుతిళ్ళు వాళ్ళతో పంచుకొన్నట్టూ వుంటుంది
మాతృభాష మాట్లాడుతున్నపుడు
మనలో ఎక్కడో పైరగాలులు హోరున సరదాగా సాగిపోతున్నట్టూ
స్వచ్చప్రవాహాలు రాళ్ళగలగలల్తో మనతో, మనభాషలో మాట్లాడినట్టూ వుంటుంది
తెల్లని పగళ్ళూ, నల్లని రాత్రులూ
రుతువులతో రూపం మార్చే ఆకాశాలూ
మనని నిండుగా కప్పుకొన్నట్టూ వుంటుంది
మాతృభాష ఒక సంపద
ఒక పురాతన వారసత్వం
ఒక జీవన సమూహపు కథలూ, కలల నిరంతర ప్రవాహం
మాతృభాష మనని మనల్నిగా నిలిపిచూపే ఒక శబ్దాల వన్నెల జెండా
మన లోలోపలి
కోరికల, భయాల, స్మృతుల, స్వప్నాల జాడల్ని
తల్లిలా మృదువుగా తాకే, పలకరించే, పరిమళింపచేసే
సంగీత పరికరం, మంత్రదండం
మాతృభాషని ప్రేమించటం మాతృమూర్తిని ప్రేమించటం
మాతృమూర్తి ప్రసాదించిన జీవితాన్ని ప్రేమించటం
జీవితం ప్రసాదించిన ఆనందాన్నీ, దు:ఖాన్నీ ప్రేమించటం
మాతృభాషని ప్రేమించటమంటే ప్రేమించటం ఎలాగో నేర్చుకోవటం
మాతృభాష నేర్చుకోవటమే భాషని నేర్చుకోవటం
అది దేనినైనా గౌరవించటమెలాగో నేర్చుకోవటం
దేనినైనా శ్రద్ధగా నేర్చుకోవటమెలాగో నేర్చుకోవటం
మాతృభాష గుండెనిండా నింపుకోవటం తెలిసినవాడికి
మరొకభాషనైనా తనలోనికి ఆహ్వానించటం ఎలానో తెలుస్తుంది
అది నోరారా పలకలేని మనిషిని చూస్తే జాలేస్తుంది
నేలమీద నిలవలేక, గాలిలో ఎగరలేక గంతులు వేస్తున్నట్లుంటుంది
పాలు ఒలకబోసుకొని నీటికోసం పరుగెడుతున్నట్లుంటుంది
మనం పుట్టిన నేల
మనకేమైనా ఇస్తుందో, లేదో కానీ
మనం నోరారా ప్రశ్నించేందుకు, జవాబు చెప్పేందుకు
మనకంటూ ఒక భాషనిస్తుంది
మన చుట్టూవున్న జీవితాన్ని చదివేందుకు, మన కథ లోకంతో పంచుకొనేందుకు
గుండెనిండా భావాలనీ, నోటినిండా అక్షరాలనీ నింపేందుకు కావలసినంత సంభాషణనిస్తుంది
మాతృభాష కళ తప్పని బంగారు స్వప్నాలనిస్తుంది
కలతపడ్డ వేళల కన్నీరు నిండిన మాటలనిస్తుంది
మన హృదయం భాషలోకి వికసించి మన జీవితం పక్వమయేలా చేస్తుంది
(మా ఊరిలో జరిగిన తెలుగు భాషా ఉత్సవాల సందర్భంగా రాసింది.)
13.12.12

ఎంత బాగా రాసారండి...చాలా చాలా నచ్చింది.
రిప్లయితొలగించండినేను ఈ బ్లాగ్ లో మీరు ప్రచురించిన అన్ని కవితలు చదివాను.
ఎన్నో రోజుల వరకు అలా గుర్తుండిపోయిన కవితలు "ఆమె", "పసిదనపు స్వర్గం".
మీ "ఆకాశం" కవితల గురించి మానస గారు రాసిన టపా చదివాను.
"ఆకాశం" ఇంకా చదవలేదు, పుస్తకం అందుబాట్లో లేక.
అనేక ధన్యవాదాలు వెన్నెల గారూ..
తొలగించండిబ్లాగు చూస్తున్నందుకూ, కవితలు నచ్చినందుకూ..
ఆకాశం అందరికీ అందుబాటులో లేకపోవటం నాకూ విచారాన్ని కలిగిస్తోంది..
కినిగే లో సాఫ్ట్ కాపీ దొరుకుతుంది కానీ,
బహుశా అలవాటువల్ల అచ్చు పుస్తకం చదవటానికే ఎక్కువమంది ఇష్టపడతారనుకొంటా..
చాలా బాగుందండి,
రిప్లయితొలగించండిమీ మాటలు చదువుతుంటే మాతృభాష పై మమకారం మరింత పెరిగింది
మీరన్నట్ట్లు 'మాతృభాషను ప్రేమించటం, మాతృమూర్తిని, ఆమె అందించిన జీవితాన్నిప్రేమించటం' లాంటి మాటలు అందరికి ఓ ధైర్యాన్ని/శక్తిని అందింస్తుందని చెప్పే భావం అధ్బుతం.
"మాతృభాష గుండెనిండా నింపుకోవటం తెలిసినవాడికి
మరొకభాషనైనా తనలోనికి ఆహ్వానించటం ఎలానో తెలుస్తుంది"...ఇది మరో ఆణిముత్యం.
నిజానికి, మానస గారు 'ఆకాశం' పరిచయం ద్వారా మాత్రమే మీ బ్లాగ్ చూశాను. ధన్యవాదాలండి.
'ఆకాశం' ఎలా అందుతుందో చెప్పరూ!!(పోస్ట్ ద్వారా)
ప్రకాష్ మూర్తి
ధన్యవాదాలు.. ప్రకాష్ మూర్తి గారూ, ఆకాశం సంపుటి హైదరాబాద్ పాలపిట్ట బుక్స్ లో, నవోదయలో దొరుకుతుంది.
తొలగించండికినిగే వెబ్ సైట్ వారు కూడా పంపిస్తారు..
ఈ లింక్ చూడండి: http://kinige.com/kbook.php?id=571&name=Aakaasam
ధన్యవాదాలండీ, నేను kinige లో order చేశాను. బహుశా ఒకటి/రెండు రోజుల్లో వస్తుందేమో!!!
తొలగించండిAm just curious to read your book. At the same time, our year end holidays are also started. Waiting to read/enjoy it. Thanks again Sir.
ధన్యవాదాలు ప్రకాష్ గారూ, ఆకాశం చదివి, నచ్చితే ఒకమాట చెప్పటం మరిచిపోకండి.
తొలగించండిఅమ్మను తృణీకరించిన వాడు సైతం గట్టి దెబ్బ తగిలితే '' అమ్మా '' అనో '' అబ్బా '' అనో కన్నవారిని చచ్చినట్లు తలుస్తాడు..భాష మన శ్వాస, కదా!
రిప్లయితొలగించండిధన్యవాదాలు రాంకుమార్ గారూ..
తొలగించండి