అందిన కవిత్వం, ప్రసాద్ గారి మూడు దశాబ్దాల సుధీర్ఘ జీవన గీతం కొన్ని పుస్తకాలుగా విడివిడిగా అలరిస్తుంది. అరుదైన కవి అద్భుతమైన వాక్యాలు, మహాత్మాగాంధీ తాను విచారానికి కలవరపాటుకు గురైన ప్రతిసారి భగవద్గీత సాంత్వన కలిగిస్తుందని చెప్పుకున్నారు. BVV Prasad's Poetry నావరకూ ఆకోవకు చెందినదే , ఒక్కటే అసూయ ఇవన్నీ నా అక్షరాలే ప్రసాద్ గారి ద్వారా వెలువడుతున్నాయి అని , ఇలాంటి కవి మన భాషలో ఇంతకాలం జీవం తొణికిసలాడుతూ కొనసాగటం భాషకు గౌరవం. ఈ నల్లనివాడు పద్మనయనమ్ములవాడు మహా శక్తిమంతుడు. ఏముందిలే అదే వాక్యం అదే భావం మళ్ళీ మళ్ళీ అదే కదా అనుకుంటామా ఛటేల్మని ఓ వాక్యం వీపు చరుస్తుంది , ఎంతో సంక్లిష్ట భావాన్ని అలవోకగా చిటెకేసినట్లు అలా విసురుతారు అంతే మనసు జిగేల్మని రగులుతుంది . "ఛ్ఛా" ఏం చెప్పారు ఎంతటి భావాన్ని ఇంతందంగా చెప్పారు కదా అనిపిస్తుంది. ఈ కవికి పరాజయం తొట్రుపాటు ఆత్మన్యూనత లాంటి మామూలు మనుఘలకు వుండే అవలక్షణాలేమీ లేవు. మనల్ని ఏ వేళనైనా తన సహజ సుందర వాక్యంతో ఆత్మీయంగా హత్తుకునే మహత్తుగలవాడు . ఇంతకీ" సృష్టి " ఎలా వుందీ అనే ప్రశ్నకు ప్రసాద్ గారి కవిత్వం పైకి ఆత్మాశ్రయంగా కనిపిస్తుంది కానీ జీవితాన్ని సాహిత్యాన్ని లోతుగా అరగదీసిన అనుభవశాలురను తీవ్రంగా అలరిస్తుంది . ధన్యవాదాలు ప్రసాద్ గారు
Thank you Bhagavan Garlanka garu for writing this!


