నీ పట్ల తను
వంద పొరపాట్లు చేసి ఉండొచ్చును
నువు తన పట్ల కూడా..
మీ మధ్య ఆర్తి ఉందో, లేదో ప్రశ్న
మీరిరువురూ ఒకటనిపిస్తుందో, లేదో ముఖ్యం
అవతలి మనిషికి సరే,
నీ కనిపించటం ముఖ్యం,
తను అద్దంలో ప్రతిబింబమని గట్టిగా తోస్తే
మీరు ఒకటి కాదనిపిస్తే
వేర్వేరు గ్రహాలకీ, పాలపుంతలకీ చెందినవారు
ఎప్పటికీ ఒకటి కాలేరు,
మీరు ఒకటైతే
ఒకే ఆత్మ ధరించిన రెండు దేహాలు
ఎప్పటికీ విడిపోలేరు
ఆర్తి లేకుంటే
ఉన్నట్లు నటించి హీనపడవద్దు,
ఆర్తి ఉంటే
లేనట్లు నటించి గాయపడవద్దు
తను సరే,
ఈ ప్రపంచమూ, నువూ
ఒకటేనా, వేర్వేరా అన్నది
మరింత ముఖ్యమైన ప్రశ్న
ఇంతా చేసి
ప్రపంచం మనకన్నా వేరు అనుకోవటం పీడకల
మనతో సహా ఉనికి అంతా
ఒకటే అనిపించటం మధుర స్వప్నం
నీ కల, నీ ఇష్టం
కేవలం నీ ఇష్టం
బివివి ప్రసాద్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి