23 ఫిబ్రవరి 2013

'ఆరాధన' కవిత్వసంపుటి, ప్రసిద్ధుల ఉత్తరాలు

'ఆరాధన ' నా మొదటి వచన కవితా సంపుటి. నా మొదటి ఇరవైలలో (1986-89) రాసుకొన్న కవిత్వం ఇది. తొలికవిత్వ రచనోత్సాహమూ, శ్రీశ్రీ ప్రభావమూ దాటి, చలం అక్షరాల్లో టాగోర్ నీ, శ్రీ రమణ మహర్షినీ చదువుకొని నా అంతరంగంలోకి ప్రయాణిస్తూ రాసుకొన్న అక్షరాలివి. ఇంతకు ముందు కూడా చెప్పినట్టు, చలం శ్రీ రమణ మహర్షి గురించి రాసిన 'భగవాన్ స్మృతులు ' చదువుకోవటం నా అంతరంగ జీవితంలో పెనుమార్పుకి మొదలు. ఈ కవితల్లో చాలాసార్లు తండ్రీ అని సంబోధించింది శ్రీ భగవాన్‌నే అని గుర్తు. టాగోర్ ప్రభావం వలన వ్యక్తీకరణలో గీతాంజలి చాయలు కనిపిస్తాయి. వ్యక్తీకరణ వరకే చాయలు. వీటిలో కనిపించే ఆర్తీ, ఆలొచనా, సున్నితత్వమూ కవి హృదయంలో పలికినవే. చదివి చూడండి స్వగృహోన్ముఖుడైన ఒకవ్యక్తి తొలి గీతాలాపన.

ఈ సంపుటిని తరువాత కాలంలో సంజీవదేవ్‌గారికీ, ఇస్మాయిల్‌గారికీ పంపిస్తూ నన్ను పరిచయం చేసుకొన్నపుడూ, హైకూకవిగా సాహిత్యలోకానికి పరిచయమయ్యాక ఓల్గాగారికి పంపినప్పుడూ వారు రాసిన లేఖలను ఇక్కడ చూడండి.

ఈ సంపుటిని ఆవకాయ.కాం నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకొని చదువుకోవచ్చును. ఆ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పుస్తకాన్ని ఇక్కడే చదవటానికీ, Scribd సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవటానికీ ఈ పోస్ట్ చివర ఇచ్చిన లింక్ చూడండి.










2 కామెంట్‌లు:

  1. ఇవాళే డౌన్లోడ్ చేసుకుని చదివాను ప్రసాద్ గారు. చాలా మంచి కవిత్వం. ఎంతో హాయిగా ఉంది. అయితే టాగోర్ ప్రభావం కనిపించింది అక్కడక్కడా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు సుబ్రహ్మణ్యం గారూ.. అవును అభివ్యక్తిపై టాగోర్ ప్రభావం ఉంది..

      తొలగించండి