నిద్రలో పాపాయి నవ్వింది
తల్లి చెప్పింది
'పాపాయితో దేవుడు మాట్లాడుతున్నాడ'ని
మనకి దేవుడు లేడు
కానీ
దేవుడంటేనే లేకపోవటం
మబ్బు మరకలు లేని నిర్మలాకాశం దైవం
మన నిండా మబ్బులు పట్టి
రంగులూ, మెరుపులూ, శబ్దాలూ, జల్లులూ వెదజల్లుతాం
మనకి దేవుడు ఉండడు
కానీ,
ఏమీ లేని నిర్మలాకాశం వంటి పాపాయితో
లేకుండా ఉన్న దేవుడు మాట్లాడితే
ఆశ్చర్యమేముంది
మీ కవిత్వం ఎంత హాయిగా ఉందో!!
రిప్లయితొలగించండి