గదిలో నేను ఎప్పటి నాతోనే కాలం గడుపుతున్నపుడు
గుమ్మంలోంచి మా అమ్మాయి మబ్బుతునకలా లోనికి వచ్చి
'నాన్నా, ఆకాశం వెళ్ళిపోతోంది చూడు' అంది.
బైటికి వచ్చి చూస్తే
సూర్యకాంతిలో స్వచ్ఛనీలంగా మెరుస్తున్న ఆకాశంలో
తేలికపాటి మబ్బు తునకలు
బడి వదిలిన పిల్లల్లా వేగంగా వెళిపోతున్నాయి
ఇన్ని సంవత్సరాలుగా
నా లోపల కదలకుండా ఉన్న ఆకాశాన్ని
కొన్ని క్షణాలు చలింపచేసి
నాకు ఆశ్చర్యాన్నీ, సంతోషాన్నీ కలిగించింది మా అమ్మాయి
ఏదీ నిలబడకపోవటం వెనుక ఎంత సంతోషం దాగి వుందీ
'ఆకాశం ఎక్కడికీ వెళ్ళదమ్మా, మబ్బులు వెళతాయి' అని
పాపతో చెప్పాలనుకొన్నాను
కానీ కదిలే ఆకాశాన్ని నాకు ఇచ్చిన ఆమెకి
కదలని ఆకాశాన్ని ఎలా ఇవ్వను
నిజంగా ఆకాశం ఎప్పుడూ వెళ్లిపోతూనే ఉందేమో
నాకు మాత్రం ఏం తెలుసు

మీ పాప మీకిచ్చిన అందమైన అనుభూతిని మాకూ పంచినందుకు ధన్యవాదాలు! :)
రిప్లయితొలగించండిచాలా బాగుందండి :-) చిన్నప్పుడు ఎంత ఆనందంగా చూసుకునే వాడినో చాలా అరుదుగా కనిపించే ఇలాంటి సంధర్బాలని.. నాకు చాలాఇష్టం.. ఇప్పటికీ అపుడపుడు చూస్తుంటాను ఎపుడన్నా కనిపిస్తాయేమోనని..
రిప్లయితొలగించండికానీ కదిలే ఆకాశాన్ని నాకు ఇచ్చిన ఆమెకి
రిప్లయితొలగించండికదలని ఆకాశాన్ని ఎలా ఇవ్వను
నిజం
మనకి తెలుసు కదా అని అన్ని చెప్పకూడదు కొన్ని అనుభూతులు కావాలంటే మౌనం గా ఉండాలి.
బడి వదిలిన పిల్లల్లా వేగంగా వెళిపోతున్నాయి
రిప్లయితొలగించండి....
ఏదీ నిలబడకపోవటం వెనుక ఎంత సంతోషం దాగి వుందీ
....
కానీ కదిలే ఆకాశాన్ని నాకు ఇచ్చిన ఆమెకి
కదలని ఆకాశాన్ని ఎలా ఇవ్వను
...
నిజంగా ఆకాశం ఎప్పుడూ వెళ్లిపోతూనే ఉందేమో
నాకు మాత్రం ఏం తెలుసు
---
ఒక జిజ్ఞాసలోంచి పుట్టిన ఊహ
దానికి తోడైన సరళమైన పదాలు
సంతోషనివ్వకుండా ఎలా వుంటాయి??
నాకూ కదిలే ఆకాశమే కనబడుతోంది అందంగా నిత్య నూతనంగా పాపకి ధన్యవాదాలు....ప్రేమతో...జగతి
రిప్లయితొలగించండి"నిజంగా ఆకాశం ఎప్పుడూ వెళ్లిపోతూనే ఉందేమో
రిప్లయితొలగించండినాకు మాత్రం ఏం తెలుసు"... చక్కటి కవిత, అంతకు మించిన భావవ్యక్తీకరణ.. చాలా బాగుందండీ... పాపకి, మీకు ధన్యవాదాలు...