పూవులు మరణిస్తాయి
సీతాకోకలు, ఇంద్రధనువులు,
సంధ్యాకాశాలు మరణిస్తాయి
రోజులు మరణిస్తాయి
ఋతువులు, అడవులు, నదులు మరణిస్తాయి
మనుషుల చిరునవ్వులు మరణిస్తాయి
ఆశలు, భయాలు, దుఃఖాలు మరణిస్తాయి
కనిపించే సమస్తమూ మరణిస్తాయి
ఎలా జన్మించాయో, అలానే
ఏ దారిలో ఇక్కడికి వచ్చాయో, ఆ దారినే
అయితే, ఇప్పుడొక ప్రశ్న
అన్నీ నిజంగా ఎక్కడి నుండో వస్తున్నాయా
ఎక్కడికో వెళుతున్నాయా
ఇప్పుడు ఉన్నచోటులోనే
వచ్చినట్లు, ఉన్నట్లు, వెళ్ళినట్లు కనిపిస్తున్నాయా
ఎక్కడికో వెళుతుంటే
ఆ వెళ్ళేచోటు ఎప్పుడు పుట్టింది
ఇక్కడనే పుడుతుంటే
ఆ పుట్టేచోటుకి ఎలా వెళ్ళాలి
మరణించిన పూలనీ, గాలుల్నీ,
కాంతులనీ, కాలాలనీ అడిగితే
ఏమన్నా రహస్యాలు చెబుతాయా
బివివి ప్రసాద్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి